నల్లగొండబ్యూరో ,డైనమిక్,అక్టోబర్22
నల్లగొండ–హైదరాబాద్ రోడ్డులో ప్రమాదాలు జరగకుండా రాత్రి సమయలో పడిపోయిన ట్రాఫిక్ బారికేడ్లను సక్రమంగా ఏర్పాటు చేసిన యువకులను డీఎస్పీ శివరాం రెడ్డి ప్రత్యేకంగా సన్మానం చేశారు.సమాచారం ప్రకారం, నల్లగొండ ఎస్పీ ఆఫీసు వద్ద గాలికి అడ్డంగా పడిపోయిన ట్రాఫిక్ బ్యారీర్‌ను గమనించిన యువకులు — కంభంపాటి రాకేష్, చంద్రగిరి క్రాంతికుమార్, భాషపాక శ్రవణ్ — ఇతర వాహనదారుల రక్షణకు సామాజిక బాధ్యతగా వాటిని సక్రమంగా స్థానంలో ఉంచారు. ఈ సందర్భాన్ని గుర్తించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ యువకులను అభినందించారు.
డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ
“పట్టణంలోని యువతలు రోడ్డుపై పడ్డ బారికేడ్లను గమనించి వాహనదారులు ప్రమాదాలకు గురి కాకుండా ముందే చర్యలు తీసుకోవడం గొప్ప సామాజిక బాధ్యత. ప్రజలు ఇలాంటి కార్యక్రమాల్లో పోలీస్ సహకారం అందించాలి. అలాగే వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలి. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద యూటర్న్ తీసుకోవడంలో షార్ట్ టర్న్ వల్ల ప్రమాదాల అవకాశాలు ఉంటాయి. కాబట్టి పోలీస్ సూచనల ప్రకారం మాత్రమే సురక్షితంగా వెళ్ళాలి.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ మహా లక్ష్మయ్య, నార్కట్పల్లి సిఐ నాగరాజు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
