ఎపి డైనమిక్ డెస్క్,అక్టోబర్ 26
విజయవాడ నుంచి కోదాడ వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు నందిగామ హైవేపైకి రాగానే ఇంజిన్ భాగం నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో అక్కడ కలకలం రేగింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.అయితే, అప్రమత్తమైన డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును రోడ్డు పక్కన ఆపి, లోపల ఉన్న 15 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. అనంతరం మరో బస్సు ద్వారా వారిని గమ్యస్థానానికి తరలించారు.డ్రైవర్ సమాచారం ప్రకారం, ఇంధన లీకేజీ కారణంగానే ఇంజిన్ నుంచి పొగలు వచ్చినట్టు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
