Thursday, January 15, 2026
Homeతాజా సమాచారంఎన్నికల నామినేషన్లపై కలెక్టర్ సూచన ప్రజల, అధికారుల సహకారం అవసరం

ఎన్నికల నామినేషన్లపై కలెక్టర్ సూచన ప్రజల, అధికారుల సహకారం అవసరం

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 1

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అధికారులు, ప్రజలు పూర్తి స్థాయి సహకారం అందించాలని కోరారు.

నామినేషన్ కేంద్రాలను పర్యవేక్షణ

మోతే, రాఘవ పురం, చివ్వేంల మండలాల బండమీది చందుపట్ల గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించి, సంబంధిత అధికారులు కు సూచనలు అందించారు.

రెండో విడత నామినేషన్లు

జిల్లా మొత్తం 8 మండలాల్లో రెండో విడత కింద 181 గ్రామ సర్పంచ్, 1628 వార్డు సభ్యుల నామినేషన్లు 49 కేంద్రాల్లో స్వీకరిస్తున్నారు. మంగళవారం రెండో విడత నామినేషన్ చివరి రోజు కావడంతో, అభ్యర్థులు ఆలస్యం కాకుండా ముందుగానే నామినేషన్ వేసుకోవాలని కలెక్టర్ సూచించారు.సాయంత్రం 5 గంటలలోపు కేంద్రాల్లో ఉన్న అభ్యర్థులకు టోకెన్ ద్వారా నామినేషన్‌లు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.

బ్యాంక్ ఖాతాల ఆవశ్యకత

పోటీ చేసే అభ్యర్థులు కొత్త బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి. కొత్త ఖాతా లేని వారు నామినేషన్ వేసి, స్క్రూటినీ సమయంలో ఖాతా వివరాలు సమర్పించాలి.మూడవ విడతలో నామినేషన్ వేయాలనుకునే అభ్యర్థులు ముందుగానే ఖాతా తెచ్చుకోవడం వల్ల నామినేషన్ ప్రక్రియ సులభంగా పూర్తి అవుతుంది.

స్వీకరించిన నామినేషన్‌లపై అభ్యంతరాలు

మొదటి విడతలో స్వీకరించిన నామినేషన్‌ల స్క్రూటినీ పూర్తయినట్లు పేర్కొన్నారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, రెజిస్ట్రార్ ఆఫీసులో అప్పీల్ చేయవచ్చని సూచించారు.

అధికారుల సన్నిహిత పర్యవేక్షణ

కలెక్టర్‌తో పాటు తహసీల్దార్ల్ వెంకన్న, చంద్ర శేఖర్, ఎంపీడోలు ఆంజనేయులు, సంతోష్ కుమార్, సంబంధిత అధికారులు కూడా స్థానంలో ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments