Tuesday, March 3, 2026
Homeతాజా సమాచారంధాన్యం కొనుగోలు, విద్యా తనిఖీలపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మిక పర్యటనలు సరైన...

ధాన్యం కొనుగోలు, విద్యా తనిఖీలపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మిక పర్యటనలు సరైన తేమశాతంతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి – కలెక్టర్ ఆదేశాలు“పదవ తరగతి భవిష్యత్తుకు తొలి మెట్టు” – విద్యార్థులకు కలెక్టర్ సూచనలు

సూర్యాపేట బ్యూరో, నవంబర్ 11 (డైనమిక్ న్యూస్)

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మంగళవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, విద్యాసంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తేమశాతం సరైన ధాన్యాన్ని ఆలస్యం చేయకండి

తిరుమలగిరి మండలంలోని తొండ, కోక్యానాయక్ తాండా, ఫణిగిరి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
ముందుగా తొండలో ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని సందర్శించి ట్యాగింగ్ చేసిన మిల్లులు, ధాన్యం తేమశాతం వివరాలను పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని ముందుగా ఆరబెట్టిన తర్వాత పంపాలని, అయితే తేమశాతం సరైన స్థాయిలో ఉంటే వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపాలని ఆయన అధికారులకు ఆదేశించారు. పౌరసరఫరాల అధికారులు మిల్లర్లతో సమన్వయం చేసుకొని ధాన్యం సకాలంలో కొనుగోలు జరిగేలా చూడాలని సూచించారు.

కోక్యానాయక్ తాండా, ఫణిగిరిలో కూడా తనిఖీలు

కోక్యానాయక్ తాండాలో ధాన్యం డ్రైయర్ పనితీరును పరిశీలించిన కలెక్టర్ రైతులతో మాట్లాడారు.ఎంత ధాన్యం తీసుకువచ్చారో, తేమశాతం ఎంతుందో అడిగి తెలుసుకున్నారు.రిజిస్టర్లు, సీరియల్ నంబర్ల ప్రకారం కొనుగోలు జరుగుతుందా లేదా అనేది స్వయంగా పరిశీలించారు.ఫణిగిరి కేంద్రంలో కూడా ధాన్యం నాణ్యత, చెల్లింపుల పరిస్థితులను సమీక్షించారు. హమాలీలకు చెల్లింపులు, టాబ్ ఎంట్రీలు, తూకం ఖచ్చితత్వంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. సరైన తేమశాతం ఉన్న ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా కొనుగోలు చేసి మిల్లులకు పంపించండి” అని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

“పదవ తరగతి భవిష్యత్తుకు తొలి మెట్టు” – కలెక్టర్ విద్యార్థులకు సందేశం

తిరుమలగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల స్పెషల్ క్లాస్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ –

“పదవ తరగతి జీవితానికి పునాది. మంచి మార్కులు సాధిస్తే ఇంటర్, డిగ్రీ, ఉద్యోగాలలో అవకాశాలు విస్తరిస్తాయి” అన్నారు.సిలబస్ పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, ప్రతి రోజు పాఠాలను సాయంత్రం తిరిగి చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు.పరీక్షల పట్ల భయాన్ని వదిలి ఆత్మవిశ్వాసంతో చదవాలి అని చెప్పారు.“ఒక అంశం పట్ల స్పష్టమైన అవగాహన ఉంటే భయం ఉండదు. లక్ష్యం నిర్ధేశించి దాని కోసం కృషి చేయండి” అని విద్యార్థులకు ప్రేరణ ఇచ్చారు.తదుపరి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తరగతులను కూడా సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.ఈ సందర్శన తనిఖీల్లో జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు, జిల్లా మేనేజర్ రాము, తహసిల్దార్ హరిప్రసాద్ ,ఎంఈఓ శాంతయ్య, ఇతర అధికారులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments