Thursday, January 15, 2026
Homeఆంధ్ర ప్రదేశ్మాచర్ల ఆరోగ్య కేంద్రం కు వస్తువుల కొనుగోళ్ల పై కలెక్టర్ కృతికా శుక్లా సమీక్ష…

మాచర్ల ఆరోగ్య కేంద్రం కు వస్తువుల కొనుగోళ్ల పై కలెక్టర్ కృతికా శుక్లా సమీక్ష…

డైనమిక్,నరసరావుపేట, అక్టోబర్ 24

పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సామాజిక ఆరోగ్య కేంద్రం, మాచర్లకు సి.ఎస్.ఆర్. నిధుల ద్వారా కొనుగోలు చేయవలసిన ఆసుపత్రి పరికరాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో ఎ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ మరియు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా, ఎ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి. వద్ద ఇప్పటికే సిద్ధంగా ఉన్న పరికరాలను వారి ద్వారా సమకూర్చి, మిగిలిన అవసరమైన పరికరాలను జిల్లా పర్చేస్ కమిటీ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలియ జేశారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తన కార్యాలయము నుండి వీడియో కాన్ఫరెన్స్ లో ఏ.పీ.డి.ఎం.ఐ.ఎస్ ప్రతినిధులు శ్రీకాంత్, కలెక్టరేట్ నుండి సిపిఓ మాలతి, కృష్ణ కిషోర్,ఏపీ డి.ఎం.ఎస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments