డైనమిక్,నరసరావుపేట, అక్టోబర్ 17
జిల్లాలో ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులు సూచించారు. బస్టాండ్లలో తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.
స్త్రీ శక్తి పథకం అమలులో పారదర్శకత
స్త్రీ శక్తి పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉన్న పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులపై ఉచిత ప్రయాణం స్పష్టంగా కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళలు ఆ సదుపాయాన్ని సులభంగా గుర్తించగలిగే విధంగా బస్సుల్లో స్పష్టమైన సూచనలు ఉండాలని కలెక్టర్ అన్నారు.
ప్రయాణీకుల పట్ల సౌమ్య ప్రవర్తనపై దృష్టి
డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణీకులతో మర్యాదగా, సౌమ్యంగా ప్రవర్తించేలా కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజలతో మమేకమవుతూ సేవా భావంతో వ్యవహరించాల్సిందిగా ఆమె సూచించారు.బస్సులను ఖచ్చితమైన సమయపాలనతో నడపాలని, జిల్లా పరిధిలోని జెడ్పీ పాఠశాలలు, జూనియర్ కళాశాలల కొత్త టైమింగ్స్‌కు అనుగుణంగా బస్సు సర్వీసులను సవరించాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో ఆర్టీసీ రీజినల్ మేనేజర్ అజిత కుమారి, డీఈవో చంద్రకళ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
