Wednesday, January 14, 2026
Homeతాజా సమాచారంమాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాలు నెక్లెస్ రోడ్‌కు బయలుదేరిన...

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాలు నెక్లెస్ రోడ్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, డైనమిక్ న్యూస్ డెస్క్, నవంబర్18

మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నెక్లెస్ రోడ్ వైపు ప్రయాణమయ్యారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ సందర్భంగా అక్కడికి చేరుకుంటున్నారు.

ఇందిరా గాంధీ విగ్రహానికి నివాళులు

కొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నెక్లెస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ఇందిరా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి సమర్పించనున్నారు. ఇందిరమ్మ సేవలు, భారత దేశ అభివృద్ధికి చేసిన కృషిని సీఎం స్మరించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం

నివాళుల అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. పేద మహిళలకు చీరల పంపిణీ ద్వారా సామాజిక న్యాయం, సంక్షేమం పట్ల ప్రభుత్వ కట్టుబాటు మరోసారి స్పష్టమవుతుందని నేతలు పేర్కొంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments