డైనమిక్ డెస్క్,హైదారాబాద్, అక్టోబర్ 24
హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులతో మాట్లాడి బాధితులకు అవసరమైన సహాయ చర్యలు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ లతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. సహాయక చర్యల సమన్వయం కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించగా, గద్వాల్ జిల్లా కలెక్టర్, ఎస్పీలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించాలని సూచించారు.

