హైదరాబాద్ , డైనమిక్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.రెండేళ్ల ప్రజా పాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగి పోయాయని, అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకు వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు.చెడుపై మంచి విజయం సాధించిన సంకేతంగా దీపావళి పండుగను రాష్ట్రంలోని ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.దీపాల కాంతులతో ప్రతి ఇంటిలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని సీఎం ఆకాంక్షించారు.అదే సమయంలో పర్యావరణానికి హాని కలిగించకుండా, ప్రమాదాలకు తావు లేకుండా చిన్నా–పెద్దలందరూ జాగ్రత్తలతో పండుగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
