ఎపి డైనమిక్ డెస్క్,నవంబర్ 3
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో జరిగిన భయంకర రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ని కోరుకున్నారు.ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలంటూ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
