🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 2:03 pm Posted by : DAINAMIC NEWS

మార్కెట్ కమిటీ అభివృద్ధికి స్పందన రాజీవ్ కీలక నిర్ణయాలు చైర్‌పర్సన్ చాంబర్, సమావేశ మందిరం నిర్మాణానికి ప్రతిపాదనలు నాబార్డ్ గోదాము నిర్మాణానికి మరోసారి ప్రభుత్వానికి ప్రతిపాదనలు గుడిగుంట్లపాలెంలో మూడు ఎకరాల స్థలం కేటాయింపునకు తీర్మానం

News Image
ముఖ్యమైన పాయింట్స్:మార్కెట్ కమిటీ అభివృద్ధికి స్పందన రాజీవ్ కీలక నిర్ణయాలుచైర్‌పర్సన్ చాంబర్, సమావేశ మందిరం నిర్మాణానికి ప్రతిపాదనలునాబార్డ్ గోదాము నిర్మాణానికి మరోసారి ప్రభుత్వానికి ప్రతిపాదనలుగుడిగుంట్లపాలెంలో మూడు ఎకరాల స్థలం కేటాయింపునకు తీర్మానం

శుభోదయ డైనమిక్ న్యూస్ – నేరేడుచర్ల, నవంబర్ 6

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి, రైతులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యంగా చైర్‌పర్సన్ రంగినేని స్పందన రాజీవ్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు పాలకమండలి సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

చైర్‌పర్సన్ చాంబర్, సమావేశ మందిరం నిర్మాణం

మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్‌పర్సన్ చాంబర్, సమావేశ మందిరం నిర్మాణానికి నూతన ప్రతిపాదనలు రూపొందించి హైదరాబాద్‌లోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకులకు పంపాలని సమావేశం తీర్మానించింది.

కార్యాలయ నిర్వహణ పనులకు ప్రతిపాదనలు

మార్కెట్ కమిటీ కార్యాలయంలో అవసరమైన మరమ్మతులు, నిర్వహణ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు.

నాబార్డ్ గోదాము ఏర్పాటుకు చర్యలు

నాబార్డ్ గోదాము నిర్మాణం కోసం మరోసారి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకులకు ప్రతిపాదనలు పంపాలని పాలకమండలి తీర్మానించింది.

మూడు ఎకరాల స్థలం కేటాయింపునకు తీర్మానం

పాలకవీడు మండలం గుడిగుంట్లపాలెం గ్రామంలో నాబార్డ్ గోదాము నిర్మాణం కోసం మూడు ఎకరాల స్థలాన్ని కేటాయించే విషయమై సంబంధిత అధికారులకు ప్రతిపాదనలు పంపాలని సమావేశం నిర్ణయించింది.

సమావేశంలో పాల్గొన్న పాలకవర్గ సభ్యులు, అధికారులు


ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ మార్కెట్ అధికారి పి. దామోదర్, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకట్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ హుజూర్‌నగర్, మార్కెట్ కమిటీ కార్యదర్శి సన్నీ,వైస్ చైర్మన్ మునగాల భాస్కర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు కర్ణం రామనరసయ్య, బుర్రి వెంకయ్య, సూరోజు రవీంద్రాచారి, ఉటకూరు సైదులు, పల్లె కాశయ్య, కత్తి శ్రీనివాస రెడ్డి, ధనావత్ సైదు, రమావత్ పశ్యానాయక్, చింతలచెర్వు ప్రియాంక, పాతరాజు జ్యోతి, రెబ్బ రమేష్, పోల విశ్వనాదం పాల్గొన్నారు.



🏠 Home