మహిళల ఆరోగ్యంపై మహిత సంస్థ ప్రత్యేక శ్రద్ధ! నేరేడుచర్ల రామ్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం.. 24 మందికి పరీక్షలు
ముఖ్యమైన పాయింట్స్:మహిళల ఆరోగ్యంపై మహిత సంస్థ ప్రత్యేక శ్రద్ధ!నేరేడుచర్ల రామ్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం.. 24 మందికి పరీక్షలు
శుభోదయ డైనమిక్ న్యూస్ – నేరేడుచర్ల
మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మహిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, ఎస్‌బీఐ ఫౌండేషన్ సౌజన్యంతో, లైఫ్ సీబీఓ సహకారంతో నేరేడుచర్ల పట్టణంలోని రామ్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరంలో 24 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిరక్షణపై వైద్య సలహాలు అందించారు. వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు.మున్సిపల్ కౌన్సిలర్ ఎంజమూరి వెంకటమ్మ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. మహిళల ఆరోగ్యం కోసం మహిత సంస్థ చేస్తున్న సేవలను ఆమె అభినందించారు.కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోహిణి, జిల్లా కోఆర్డినేటర్ సయ్యద్ సజ్జాద్ అలీ, వైద్య సిబ్బంది, స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు.