పోలీస్ ఉద్యోగాలే లక్ష్యం.. ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక శిక్షణ! 20 మందికి నాలుగు నెలల పాటు శిక్షణ.. రూ.3.50 లక్షల ఆర్థిక సాయం
ముఖ్యమైన పాయింట్స్:పోలీస్ ఉద్యోగాలే లక్ష్యం.. ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక శిక్షణ!20 మందికి నాలుగు నెలల పాటు శిక్షణ.. రూ.3.50 లక్షల ఆర్థిక సాయం
శుభోదయం డైనమిక్ న్యూస్ – మేడ్చల్–మల్కాజిగిరి, నవంబర్ 4:
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్న ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తెలంగాణ మహిళా భద్రతా విభాగంలోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సమన్వయం చేస్తోంది.ఈ కార్యక్రమంలో ఎంపికైన 20 మంది ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు నాలుగు నెలల పాటు పోలీస్ ఉద్యోగాల రాత పరీక్షలకు ప్రత్యేక శిక్షణతో పాటు హాస్టల్ వసతి కల్పించనున్నారు. శిక్షణ, వసతి ఖర్చుల నిమిత్తం సంబంధిత శాఖ రూ.3.50 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది.ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం విశేషం.