ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు రూ.18 వేల గౌరవ వేతనం ఇవ్వాలి బెల్లంకొండ సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి
ముఖ్యమైన పాయింట్స్:ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు రూ.18 వేల గౌరవ వేతనం ఇవ్వాలిబెల్లంకొండ సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి
నడిగూడెం, నవంబర్ 4 (శుభోదయ డైనమిక్ వార్త):
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు రూ.18 వేల గౌరవ వేతనం చెల్లించాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ మహాసభలను జయప్రదం చేయాలని చేపట్టిన ప్రచారంలో భాగంగా బుధవారం నడిగూడెం మండల కేంద్రంలో ఫీల్డ్ అసిస్టెంట్లను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా బెల్లంకొండ సత్యనారాయణ మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా సేవలందిస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 4779 జీవోను రద్దు చేసి ఫీల్డ్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారి శ్రమకు తగిన గుర్తింపు, గౌరవ వేతనం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అఖిల భారత కిసాన్ మహాసభలకు ఫీల్డ్ అసిస్టెంట్లు, కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ కొరట్ల శ్రీనివాస్, రైతు సంఘం సీనియర్ నాయకులు వీరాంజనేయులు, ఎస్.కె. లతీఫ్ బాబు, సుధాకర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ల మండల అధ్యక్షురాలు పద్మ, కొరట్ల వెంకటేశ్వర్లు, అంబేద్కర్, సీతారాం రెడ్డి, ఎస్.కె. మాసంబి తదితరులు పాల్గొన్నారు.