🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 November 2026, 6:58 am Posted by : DAINAMIC NEWS

ఘనంగా శ్రీ షిరిడీ సాయిబాబా మందిర 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం

News Image
ముఖ్యమైన పాయింట్స్:ఘనంగా శ్రీ షిరిడీ సాయిబాబా మందిర 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం


నడిగూడెం, నవంబర్ 4 (శుభోదయ డైనమిక్ వార్త):

స్థానిక శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో 25వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం బాబా వారికి మంగళస్నానం, సుప్రభాత సేవ, కాకడ హారతి, విఘ్నేశ్వర పూజ, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం 24 గంటల పాటు సాగే సాయి నామ సంకీర్తనను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, ఏకాహం దాతలు పాల్గొని బాబా సేవలో తరించారు.ఆలయ అర్చకులు రాజశేఖర్ శర్మ శాస్త్రోక్తంగా, నిష్ఠతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా షిరిడీ సాయిబాబా మందిర సమితి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తొలిరోజు వేడుకలకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది.గురువారం జరిగే కార్యక్రమాల్లో భాగంగా పంచామృత, ఫలరసాలతో అభిషేకాలు, ప్రత్యేక పుష్పాలంకరణ, సహస్రనామ పూజలు, ఆధ్యాత్మిక సందేశాలు, సాయి సత్సంగం, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నప్రసాద వితరణ చేపట్టనున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పందిరి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి అనంతల కృష్ణయ్య, కమిటీ సభ్యులు, దాతలు, భక్తులు పాల్గొన్నారు. తీర్థప్రసాదాల పంపిణీతో తొలిరోజు కార్యక్రమాలు ముగిశాయి.
🏠 Home