🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 November 2026, 4:40 pm Posted by : DAINAMIC NEWS

బియ్యం నాణ్యతలో రాజీ వద్దు! జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గోదాంల నిర్వహణపై కలెక్టర్ తనిఖీలు.. ఆరు బఫర్ గోదాంల హమాలీలకు లేబర్ కార్డులు

News Image
ముఖ్యమైన పాయింట్స్:బియ్యం నాణ్యతలో రాజీ వద్దు! జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్గోదాంల నిర్వహణపై కలెక్టర్ తనిఖీలు.. ఆరు బఫర్ గోదాంల హమాలీలకు లేబర్ కార్డులు


శుభోదయ డైనమిక్ న్యూస్ – సూర్యాపేట, నవంబర్ 4:

పేదలకు పంపిణీ చేసే బియ్యం నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కోదాడ సమీపంలోని బాలాజీనగర్ ఎస్‌డబ్ల్యూసీ గోదాంను జిల్లా ఎస్పీ కె. నరసింహతో కలిసి ఆయన తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోదాంలోని బియ్యం నిల్వలు, స్టాక్ రికార్డులు, నిర్వహణ తీరును పరిశీలించారు. బియ్యం నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షలు నిర్వహించగా ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బియ్యం నిల్వలో భద్రతా ప్రమాణాలు పాటించాలని, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ (ఎఫ్‌ఐఎఫ్‌ఓ) విధానాన్ని అమలు చేయాలని గోదాం మేనేజర్, సిబ్బందికి సూచించారు.

హమాలీలకు లేబర్ కార్డులు

గోదాంలో పనిచేస్తున్న హమాలీల సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. లేబర్ కార్డులు ఇప్పించాలని వారు కోరడంతో వెంటనే స్పందించిన కలెక్టర్, జిల్లాలోని ఆరు బఫర్ గోదాంలలో పనిచేస్తున్న హమాలీలందరికీ లేబర్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వారి ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, తహసీల్దార్ సంతోష్ కిరణ్, ఎస్‌డబ్ల్యూసీ మేనేజర్ సందీప్, టెక్నికల్ అసిస్టెంట్లు భాస్కర్ రెడ్డి, అరుణ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home