నేరేడుచర్లలో ఎమ్మెల్సీ ఓటుకు 2,497 దరఖాస్తులు! 655 దరఖాస్తులకు ఆమోదం.. 39 తిరస్కరణ.. 1,803 పరిశీలనలో
ముఖ్యమైన పాయింట్స్:నేరేడుచర్లలో ఎమ్మెల్సీ ఓటుకు 2,497 దరఖాస్తులు!655 దరఖాస్తులకు ఆమోదం.. 39 తిరస్కరణ.. 1,803 పరిశీలనలో
శుభోదయ డైనమిక్ న్యూస్ – నేరేడుచర్ల, నవంబర్ 4
నేరేడుచర్ల మండలంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియకు భారీగా దరఖాస్తులు అందాయి. ఇప్పటివరకు మొత్తం 2,497 దరఖాస్తులు వచ్చినట్లు ఎంఆర్ఓ సూరిగి సైదులు వెల్లడించారు. వీటిలో 655 దరఖాస్తులకు ఆమోదం లభించగా, 39 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని, మరో 1,803 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.
ఆన్‌లైన్‌లోనే అధిక దరఖాస్తులు
మొత్తం దరఖాస్తుల్లో 2,495 ఆన్‌లైన్ ద్వారా, రెండు ఆఫ్‌లైన్ ద్వారా అందినట్లు ఎంఆర్ఓ వివరించారు. ఆమోదం పొందిన వాటిలో 653 ఆన్‌లైన్ దరఖాస్తులు, రెండు ఆఫ్‌లైన్ దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు.
అర్హులైన పట్టభద్రులు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలి
ఇప్పటివరకు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోని అర్హులైన పట్టభద్రులు ఆలస్యం చేయకుండా త్వరగా దరఖాస్తు చేసుకోవాలని ఎంఆర్ఓ సూరిగి సైదులు సూచించారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును పొందేందుకు నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.