🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 November 2026, 4:21 pm Posted by : DAINAMIC NEWS

జాన్‌పహాడ్ దర్గాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ సరికొప్పుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రె స్‌కు ప్రత్యేక పూజలు! ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు

News Image
ముఖ్యమైన పాయింట్స్:జాన్‌పహాడ్ దర్గాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ సరికొప్పుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలోజనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రె స్‌కు ప్రత్యేక పూజలు!ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు

శుభోదయ డైనమిక్ న్యూస్ – పాలకవీడు, నవంబర్ 4


హుజూర్‌నగర్ నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ సరికొప్పుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పాలకవీడు మండలంలోని ప్రసిద్ధ జాన్‌పహాడ్ దర్గాలో జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ వాహనం ద్వారా స్థానిక పోలీస్ స్టేషన్, ప్రభుత్వ పాఠశాలలో అర్హులైన పట్టభద్రులకు ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించి, నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాయిని మధు, శ్రీనివాస్ రెడ్డి, షేక్ రషీద్, నాగచారి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

🏠 Home