ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి మాజీ జెడ్పీటీసీ కోల ఉపేందర్ రావు
ముఖ్యమైన పాయింట్స్:ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకోవాలిమాజీ జెడ్పీటీసీ కోల ఉపేందర్ రావు
శుభోదయ డైనమిక్ న్యూస్ మునగాల
నవంబర్ 3
సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటు హక్కు నమోదు ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశానుసారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మునగాల మండలంలోని తాడ్వాయి, మాధవరం,వెంకట్రాంపురం, నేలమర్రి గ్రామాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఇంచార్జి, మాజీ జెడ్పీటీసీ కోల ఉపేందర్ రావు పాల్గొని పట్టభద్రులకు ఓటు హక్కు నమోదు ప్రాముఖ్యతను వివరించారు.
ఈ సందర్భంగా కోల ఉపేందర్ రావు మాట్లాడుతూ పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటు హక్కును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, పట్టభద్రులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, పీఏసీఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, సమన్వయ కమిటీ సభ్యులు ప్రదీప్ సార్, మాధవరం సర్పంచ్ అరె సురేందర్ రెడ్డి, యువజన నాయకులు కపర్తి మణికంఠ, షేక్ సైద లింగరాజు, సాయి , నాగులు BRS నాయకులు పాల్గొన్నారు.