పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు! మోతె మండలంలో విద్యుత్ వృథా.. పట్టించుకోని పంచాయతీ అధికారులు కార్యదర్శులు, సర్పంచుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం
ముఖ్యమైన పాయింట్స్:పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు!మోతె మండలంలో విద్యుత్ వృథా.. పట్టించుకోని పంచాయతీ అధికారులుకార్యదర్శులు, సర్పంచుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం
మోతె, అక్టోబర్ 29, శుభోదయ డైనమిక్ న్యూస్,
ఒకవైపు విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని ప్రభుత్వం సూచిస్తుంటే.. మరోవైపు మోతె మండలంలోని పలు గ్రామాల్లో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతుండటం విమర్శలకు తావిస్తోంది. మండల కేంద్రంతో పాటు నామవరం, రాఘవపురం ఎక్స్‌రోడ్, నేరేడువాయి, బోడబండ్లగూడెం, సిరికొండ గ్రామాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.గ్రామాల్లో విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షించాల్సిన పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు ఈ విషయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి దీపాల నియంత్రణకు ఆటోమేటిక్ స్విచ్‌లు ఏర్పాటు చేస్తామని గతంలో గ్రామసభల్లో ప్రకటించినప్పటికీ, ఆ హామీలు ఆచరణలోకి రాలేదని విమర్శిస్తున్నారు.అవసరం లేకున్నా పగటిపూట దీపాలు వెలగడంతో విద్యుత్ వృథా అవడమే కాకుండా గ్రామపంచాయతీలపై అదనపు విద్యుత్ బిల్లుల భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుధ్య సిబ్బంది విధుల నిర్వహణపై కూడా పర్యవేక్షణ కొరవడిందని పలువురు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించాలి!
సంబంధిత ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, పగటిపూట వెలుగుతున్న వీధి దీపాలను నియంత్రించాలని, ఆటోమేటిక్ స్విచ్‌లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. విద్యుత్ పొదుపుపై ప్రభుత్వం చేస్తున్న సూచనలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.