🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 October 2026, 6:18 pm Posted by : DAINAMIC NEWS

తెలంగాణ రక్షణ సేనలో రాఘవపురం ఎక్స్‌రోడ్ నాయకుల చేరిక కవితమ్మ పంచజన్యాల నినాదానికి ఆకర్షితులై పార్టీలో చేరిక

News Image
ముఖ్యమైన పాయింట్స్:తెలంగాణ రక్షణ సేనలో రాఘవపురం ఎక్స్‌రోడ్ నాయకుల చేరికకవితమ్మ పంచజన్యాల నినాదానికి ఆకర్షితులై పార్టీలో చేరిక


మోతె,శుభోదయ డైనమిక్ వార్త, అక్టోబర్ 27


సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మోతె మండలం రాఘవపురం ఎక్స్‌రోడ్‌కు చెందిన పలువురు నాయకులు తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) పార్టీలో చేరారు. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితమ్మ సమక్షంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కుందూరు దేవేందర్ రెడ్డి, కోదాడ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్యా సంజీవరావు నాయక్, మండల నాయకుడు ధరావత్ కృష్ణ ఆధ్వర్యంలో పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు.

ఐదు పంచజన్యాలే పార్టీ ప్రధాన లక్ష్యం

కల్వకుంట్ల కవితమ్మ ప్రతిపాదించిన ఐదు పంచజన్యాల నినాదానికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు నాయకులు తెలిపారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, వ్యవసాయ రంగ అభివృద్ధి, ఉపాధి కల్పన, సామాజిక న్యాయం ప్రధాన లక్ష్యాలుగా ముందుకు సాగుతున్న తెలంగాణ రక్షణ సేన విధానాలు తమను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు.

ఉచిత విద్య, వైద్యం.. రైతులకు అండ

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత విద్య అందించడం, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం కల్పించడం తమ లక్ష్యాలని పార్టీ నాయకులు వివరించారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి రైతులను రాజులుగా చేయడం, సాగునీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారిస్తామని తెలిపారు.

యువతకు ఉద్యోగాలు, స్వయం ఉపాధి

తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేకంగా లక్ష ఉద్యోగాలు కల్పించడంతోపాటు, మిగతా మూడు లక్షల ఉద్యోగాల భర్తీకి తొలి ఏడాదిలోనే నోటిఫికేషన్లు విడుదల చేయాలనే ప్రతిపాదనను పార్టీ ముందుకు తెచ్చిందని నాయకులు వివరించారు. ఉద్యోగాలకే పరిమితం కాకుండా స్వయం ఉపాధి కోరుకునే యువతకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించి చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించేందుకు ప్రోత్సహిస్తామని తెలిపారు.

సామాజిక న్యాయమే లక్ష్యం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతోపాటు అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు సమానంగా అందేలా కృషి చేయడమే సామాజిక న్యాయమని పార్టీ నాయకులు పేర్కొన్నారు.

పార్టీలో చేరిన ప్రముఖులు

తెలంగాణ రక్షణ సేనలో చేరిన వారిలో సీనియర్ నాయకులు కారింగుల శ్రీనివాస్ గౌడ్, బొర్రాజు రాములు యాదవ్, మద్ది శాంతమ్మ, మాజీ ఎంపీటీసీ భానోత్ మధు నాయక్, ఆటో యూనియన్ అధ్యక్షుడు పాలకురి శ్రీనివాస్ గౌడ్, కుంచం శ్రీహరి, యువ నాయకులు కారింగుల కిరణ్ గౌడ్, షేక్ ఖాన్ తదితరులు ఉన్నారు.

🏠 Home