ఇందిరమ్మ ఇళ్లు నిజమైన లబ్ధిదారులకే కేటాయించాలి! ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన లాల్ లక్ష్మీపురం వార్డు సభ్యులు
ముఖ్యమైన పాయింట్స్:ఇందిరమ్మ ఇళ్లు నిజమైన లబ్ధిదారులకే కేటాయించాలి!ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన లాల్ లక్ష్మీపురం వార్డు సభ్యులు
నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్
మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో లాల్ లక్ష్మీపురం గ్రామ సమస్యలపై వార్డు సభ్యులు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వార్డు సభ్యుడు పర్వతం చంద్రగిరి ఆధ్వర్యంలో 3వ వార్డు సభ్యురాలు వానరాసి ధనమ్మ, 6వ వార్డు సభ్యుడు పర్వతం సైదులు అధికారులకు ఫిర్యాదు అందజేశారు.నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి అని వారు డిమాండ్ చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను అధికారులు పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.ఇదిలా ఉండగా, నేరేడుచర్ల మండల ప్రజావాణిలో మొత్తం నాలుగు దరఖాస్తులు అందినట్లు ఎంపీవో నాగరాజు తెలిపారు. ఈ నాలుగు దరఖాస్తులూ లాల్ లక్ష్మీపురం గ్రామపంచాయతీ పరిధి నుంచి హౌసింగ్ శాఖకు సంబంధించినవని, కార్యక్రమంలో 22 మంది అధికారులు పాల్గొన్నారని వెల్లడించారు.