బీజేపీ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వరా? కాంగ్రెస్ ప్రభుత్వంపై గొడ్డేటి పవన్ కుమార్ యాదవ్ ఆగ్రహం
ముఖ్యమైన పాయింట్స్:బీజేపీ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వరా?కాంగ్రెస్ ప్రభుత్వంపై గొడ్డేటి పవన్ కుమార్ యాదవ్ ఆగ్రహం
శుభోదయ డైనమిక్ న్యూస్ – నేరేడుచర్ల,అక్టోబర్ 25
అర్హులైన బీజేపీ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించకపోతే ఆందోళనలు చేపడతామని బీజేపీ నేరేడుచర్ల మాజీ మండల అధ్యక్షుడు గొడ్డేటి పవన్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ పక్షపాతం చూపుతోందని ఆయన ఆరోపించారు.ఈ సందర్భంగా పవన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఇల్లు ప్రతి పేద కుటుంబానికి హక్కు అని, సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారందరికీ అందించాలని డిమాండ్ చేశారు. పార్టీకి మద్దతు ఇస్తున్నారనే కారణంతో అర్హులకు ఇళ్లు నిరాకరించడం సరికాదన్నారు.ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పారదర్శకత పాటించి, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో బాధితులను ఏకం చేసి తహసీల్దార్ కార్యాలయం, కలెక్టరేట్ ఎదుట ధర్నాలు, ఆందోళనలు చేపడతామని పవన్ కుమార్ యాదవ్ హెచ్చరించారు.