🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 25 October 2026, 8:08 am Posted by : DAINAMIC NEWS

ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై కాంగ్రెస్ రెబల్ వార్డు సభ్యురాలు ధనమ్మ ఘాటు విమర్శలు! గుడిసెల్లో నివసిస్తున్న నాకే ఇల్లు లేదు.. పేదలకు ఎలా న్యాయం చేస్తారు? సంతకాలప్పుడు వార్డు సభ్యులు కావాలి.. ఇళ్ల ఎంపికలో మాత్రం పట్టించుకోరా? అర్హులైన నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలి..

News Image
ముఖ్యమైన పాయింట్స్:ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై కాంగ్రెస్ రెబల్ వార్డు సభ్యురాలు ధనమ్మ ఘాటు విమర్శలు!గుడిసెల్లో నివసిస్తున్న నాకే ఇల్లు లేదు.. పేదలకు ఎలా న్యాయం చేస్తారు?సంతకాలప్పుడు వార్డు సభ్యులు కావాలి.. ఇళ్ల ఎంపికలో మాత్రం పట్టించుకోరా?అర్హులైన నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలి.. లేదంటే ఉద్యమం ఉధృతం చేస్తాం

శుభోదయ డైనమిక్ న్యూస్, నేరేడుచర్ల,అక్టోబర్ 25

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం లాల్ లక్ష్మీపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రెబల్ మూడో వార్డు సభ్యురాలు పెద్ద ధనమ్మ గ్రామ సర్పంచ్ పర్వతం పార్వతి వ్యవహారశైలిపై ఘాటుగా విమర్శలు చేశారు. అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

గుడిసెల్లో నివసిస్తున్న ప్రజాప్రతినిధిని

ప్రజలు తనను ఎన్నుకుని వార్డు సభ్యురాలిగా గెలిపించినప్పటికీ, తాను తన కుటుంబంతో కలిసి ఇప్పటికీ పూరి గుడిసెలోనే నివసిస్తున్నానని ధనమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తనకే ఇల్లు లేని పరిస్థితి ఉంటే, పేద ప్రజలకు ఎలా న్యాయం చేయగలనని ప్రశ్నించారు. తాను మూడో వార్డు సభ్యురాలిగా గెలిచిన అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు శాలువా కప్పి సత్కరించారని గుర్తుచేశారు.

అభివృద్ధి పనుల్లో పారదర్శకత ఏది?

గ్రామంలో సీసీ రోడ్లు, గ్రామపంచాయతీ భవనం, వీధిలైట్ల ఏర్పాటుకు ఎన్ని నిధులు వచ్చాయి? వాటిని ఎలా ఖర్చు చేశారనే వివరాలను వార్డు సభ్యులకు తెలియజేయడం లేదని ధనమ్మ ఆరోపించారు. గ్రామ సర్పంచ్ అన్ని విషయాల్లోనూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.సంతకాలు తీసుకునే సమయంలో వార్డు సభ్యులు అవసరమవుతున్నారని, బిల్లులు తీసుకునే సమయంలో మాత్రం తమను పట్టించుకోవడం లేదని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలోనూ వార్డు సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాపై మరోసారి పునరాలోచన చేసి, నిజమైన అర్హులను గుర్తించి ఇళ్లు మంజూరు చేయాలని ధనమ్మ డిమాండ్ చేశారు. గ్రామంలో మొదటి నుంచి నివసిస్తూ గుడిసెల్లో జీవనం సాగిస్తున్న పేద కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.మూడో విడతలో సర్పంచ్‌కు ఇల్లు కేటాయించే అంశాన్ని పరిశీలించి, ప్రస్తుత విడతలో అర్హులైన నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేయాలని సూచించారు. తన కుటుంబానికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఇళ్ల ఎంపికలో వార్డు సభ్యుల ప్రమేయం లేదా?

గ్రామ అభివృద్ధి పనులకు సంబంధించిన సంతకాల సమయంలో వార్డు సభ్యులు అవసరమవుతున్నారని, కానీ బిల్లులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో మాత్రం తమను పట్టించుకోవడం లేదని ధనమ్మ ప్రశ్నించారు. గ్రామంలో ఎంతమంది సర్పంచులు ఉన్నారని, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం ఏమిటని నిలదీశారు.అర్హులైన నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేయకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.



🏠 Home