ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో సర్పంచ్ సతీమణి పేరు! గుడిసెల్లో నిరుపేదలు.. లబ్ధిదారుల ఎంపికపై విమర్శలు విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలి: బీఆర్ఎస్ నాయకుడు పర్వతం చంద్రగిరి
ముఖ్యమైన పాయింట్స్:ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో సర్పంచ్ సతీమణి పేరు!గుడిసెల్లో నిరుపేదలు.. లబ్ధిదారుల ఎంపికపై విమర్శలువిచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలి: బీఆర్ఎస్ నాయకుడు పర్వతం చంద్రగిరి
శుభోదయ డైనమిక్ న్యూస్, నేరేడుచర్ల, అక్టోబర్ 25
లాల్ లక్ష్మీపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై బీఆర్ఎస్ నాయకుడు, ప్రస్తుత 5వ వార్డు సభ్యుడు పర్వతం చంద్రగిరి అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ సతీమణి పేరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో ఉండటంపై ఆయన ప్రశ్నించారు.గ్రామంలో పలువురు నిరుపేదలు ఇప్పటికీ గుడిసెల్లో నివసిస్తున్నారని, ఇళ్లు లేని పేదలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సమగ్ర విచారణ జరపాలి
లబ్ధిదారుల ఎంపికపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం అర్హతలను పరిశీలించాలని పర్వతం చంద్రగిరి డిమాండ్ చేశారు. విచారణలో అనర్హులుగా తేలిన వారి పేర్లను తొలగించి, అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించి న్యాయం చేయాలని కోరారు.