🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 24 October 2026, 7:15 am Posted by : DAINAMIC NEWS

గోపాతండాలో ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం ప్రతిభావంతులైన యువతీ యువకులకు సత్కారం.. విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

News Image
ముఖ్యమైన పాయింట్స్:గోపాతండాలో ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానంప్రతిభావంతులైన యువతీ యువకులకు సత్కారం.. విద్యార్థులకు పుస్తకాల పంపిణీ


శుభోదయ డైనమిక్ న్యూస్ | గోపాతండా,, అక్టోబర్ 24

గ్రామ అభివృద్ధి, విద్యాభివృద్ధి, యువత ప్రోత్సాహమే లక్ష్యంగా గోపాతండా ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ భూక్యా భిక్క నాయక్, గ్రామ పెద్దలు, ఉద్యోగులు, యువత, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.గ్రామం నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందిన కొర్ర రాంకోటి ఉద్యోగ విరమణ సందర్భంగా ఆయన సేవలను గుర్తించి శాలువా, మెడల్‌తో ఘనంగా సన్మానించారు. ఆయన సేవలు యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.అదేవిధంగా గ్రామంలో ఉద్యోగాలు సాధించిన యువతీ యువకులతో పాటు మహిళా ఉద్యోగులు, ఐఐటీ, ఎన్‌ఐటీ, ఎంబీబీఎస్‌, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యా రంగాల్లో ప్రతిభ చాటిన వారిని సత్కరించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి విద్య ప్రాధాన్యతను వివరించారు.ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, విద్య, ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత, యువత భవిష్యత్తుపై చర్చించారు. గ్రామ పురోగతికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపడంతో పాటు గ్రామంలో ఐక్యత, విద్యా చైతన్యాన్ని పెంపొందిస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
🏠 Home