🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 23 October 2026, 11:01 am Posted by : DAINAMIC NEWS

మోతె మండల పరిషత్ కార్యాలయంలో జెడ్పీసీఓ ఆకస్మిక తనిఖీ పింఛన్ దరఖాస్తుల పరిశీలన.. ఉపాధి హామీ పనులపై అధికారులకు ఆదేశాలు

News Image
ముఖ్యమైన పాయింట్స్:మోతె మండల పరిషత్ కార్యాలయంలో జెడ్పీసీఓ ఆకస్మిక తనిఖీపింఛన్ దరఖాస్తుల పరిశీలన.. ఉపాధి హామీ పనులపై అధికారులకు ఆదేశాలు

శుభోదయ డైనమిక్ న్యూస్, మోతె,అక్టోబర్ 23

సూర్యాపేట జిల్లా మోతె మండల పరిషత్ కార్యాలయాన్ని జెడ్పీసీఓ శిరీష గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పింఛన్ వెరిఫికేషన్ దరఖాస్తులు, రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించారు. దరఖాస్తు ఫారాల్లో జత చేస్తున్న పత్రాలను తెప్పించుకొని తనిఖీ చేశారు.అనంతరం వి.బి.జి. రామ్ జీ పథకం కింద ప్రతి గ్రామపంచాయతీలో 60 మంది కూలీలు పని చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలు సమన్వయంతో పనిచేస్తూ పనుల నిర్వహణను పర్యవేక్షించాలని సూచించారు.ఈ తనిఖీలో ఎంపీడీవో సందీప్ కుమార్, ఎంపీవో వంశీకృష్ణ, ఈసీ డి. శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

🏠 Home