🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 23 October 2026, 10:58 am Posted by : DAINAMIC NEWS

ఘనంగా స్వేరోస్ డే వేడుకలు విద్యే ఆయుధం.. సమానత్వమే లక్ష్యం

News Image
ముఖ్యమైన పాయింట్స్:ఘనంగా స్వేరోస్ డే వేడుకలువిద్యే ఆయుధం.. సమానత్వమే లక్ష్యం


శుభోదయ డైనమిక్ న్యూస్ – మోతె, అక్టోబర్ 23


సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో గురువారం స్వేరోస్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లపల్లి శివకృష్ణ ఆధ్వర్యంలో, మోతె మండల అధ్యక్షుడు డి. దుర్గారావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్. శంకరన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్వేరోస్ జెండాను ఆవిష్కరించి, జై భీమ్, జై స్వేరోస్, విద్య–వినయం–సమానత్వం నినాదాలతో కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. స్వేరోస్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారు.

విద్యార్థులకు పెన్నుల పంపిణీ

స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చదువు ప్రాముఖ్యతను వివరిస్తూ పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లపల్లి శివకృష్ణ మాట్లాడుతూ, అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం లక్ష్యాలుగా జ్ఞాన సమాజ నిర్మాణానికి స్వేరోస్ కృషి చేస్తోందన్నారు. పేద విద్యార్థులు సైతం ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 22న స్వేరోస్ డే నిర్వహించడం వెనుక విద్య, సమానత్వంపై అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.మోతె మండల అధ్యక్షుడు డి. దుర్గారావు మాట్లాడుతూ, మండలంలోని ప్రతి గ్రామంలో స్వేరోస్ శాఖలను ఏర్పాటు చేసి యువతలో విద్య, సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్వేరోస్ నాయకులు వెంకటేశ్వర్లు, మహేష్, చిరంజీవి, కిరణ్ కుమార్, తరుణ్, త్రినాధ్, త్రిషిత, చిన్ను, రావణ్, రంజిత్‌తో పాటు స్వేరోస్ కార్యకర్తలు, విద్యార్థులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

🏠 Home