🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 20 October 2026, 3:31 pm Posted by : DAINAMIC NEWS

నేరేడుచర్ల సహకార సంఘంలో నూతన కౌంటర్ ప్రారంభం రైతులు సంఘం సేవలను సద్వినియోగం చేసుకోవాలి: అధ్యక్షుడు కొప్పుల రాంరెడ్డి

News Image
ముఖ్యమైన పాయింట్స్:నేరేడుచర్ల సహకార సంఘంలో నూతన కౌంటర్ ప్రారంభంరైతులు సంఘం సేవలను సద్వినియోగం చేసుకోవాలి: అధ్యక్షుడు కొప్పుల రాంరెడ్డి


నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త, అక్టోబర్ 20:

నేరేడుచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో నూతనంగా నిర్మించిన కౌంటర్‌ను మంగళవారం సంఘం అధ్యక్షుడు కొప్పుల రాంరెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ కోణతం చిన్న వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి హాజరయ్యారు. సంఘ డైరెక్టర్లు పోరెడ్డి పద్మ, తాళ్ల సురేష్ రెడ్డి, నూకల వెంకట్ రెడ్డి, వేముల జయమ్మ, మున్సిపల్ కౌన్సిలర్ ఇంజమూరి శ్రీకాంత్, సంఘ సీఈవో డి. శ్రీనివాస్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు కొప్పుల రాంరెడ్డి మాట్లాడుతూ.. సంఘం ద్వారా రైతులకు అందిస్తున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలు, వ్యవసాయ రుణాలు, తనఖా రుణాలు, వ్యవసాయ పురుగుమందుల సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు మరిన్ని సేవలు అందించడంతోపాటు సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
🏠 Home