బూరుగడ్డ మాచవరంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, సర్పంచ్ యరగాని రాధా నాగరాజుకు కాంగ్రెస్ కార్యకర్తల సన్మానం మహిళల ఆటపాటలతో పండుగ శోభ
ముఖ్యమైన పాయింట్స్:బూరుగడ్డ మాచవరంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలుమాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, సర్పంచ్ యరగాని రాధా నాగరాజుకు కాంగ్రెస్ కార్యకర్తల సన్మానంమహిళల ఆటపాటలతో పండుగ శోభ
హుజూర్‌నగర్ రూరల్, శుభోదయ డైనమిక్ న్యూస్అక్టోబర్ 19
బూరుగడ్డ మాచవరం గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, బూరుగడ్డ గ్రామ సర్పంచ్ యరగాని రాధా నాగరాజును కాంగ్రెస్ కార్యకర్తలు సన్మానించారు.గ్రామ సర్పంచ్ యరగాని రాధా నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. మహిళల కోలాహలంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ వేడుకలు
మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.
పలువురు ప్రముఖుల హాజరు
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ మేకపోతుల వెంకన్న, దేవాలయ చైర్మన్ బిక్షం, మాజీ చైర్మన్ గురవయ్య, శివాలయం చైర్మన్ చిమట సైదులు, కనకదుర్గమ్మ ఆలయ చైర్మన్ బత్తిని ఎంకన్న, ఉపసర్పంచ్ గడ్డం నాగయ్య పాల్గొన్నారు.అలాగే వార్డు సభ్యులు గువ్వల ఆంజనేయులు, ఎరగాని సైదులు, బత్తిని సర్వయ్య, పెండెం మట్టపల్లి, ధర్మకర్తలు ఎరగాని సతీష్, గూడెపు నాగలింగం, మాడుగుల శేఖర్, ఎరగాని ఎంకన్న, రాగం నాగయ్య తదితరులు హాజరయ్యారు. గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో బూరుగడ్డ మాచవరంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.