మున్సిపల్ సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ సిబ్బంది ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం..మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి
ముఖ్యమైన పాయింట్స్:మున్సిపల్ సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీసిబ్బంది ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం..మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి
నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త, అక్టోబర్ 18
మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తూ నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శానిటేషన్ సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ) కిట్లను పంపిణీ చేశారు.నేరేడుచర్ల పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పారిశుధ్య సిబ్బందికి దుస్తులు, సబ్బులు, కొబ్బరినూనె, అప్రాన్లు, చెప్పులు, గ్లౌజులు, టవల్స్‌తో కూడిన కిట్లను అందజేశారు. పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, ఇతర క్షేత్రస్థాయి విధులు నిర్వహించే సమయంలో సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటించాలని, పీపీఈ కిట్లను తప్పనిసరిగా వినియోగించాలని మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు సూచించారు.సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐదో వార్డు కౌన్సిలర్ నన్నెపంగ శ్రీనివాస్, తొమ్మిదో వార్డు కౌన్సిలర్ ఇంజమూరి శ్రీకాంత్, 11వ వార్డు కౌన్సిలర్ షేక్ షహనాజ్, 13వ వార్డు కౌన్సిలర్ బొలిశెట్టి లక్ష్మయ్య, కో-ఆప్షన్ సభ్యురాలు షేక్ మొగలాభి తదితరులు పాల్గొన్నారు.