🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 17 October 2026, 4:02 pm Posted by : DAINAMIC NEWS

శక్తి ఆరాధనకు ప్రతీక.. కర్తవ్య నిర్వహణకు స్ఫూర్తి ఆయుధ పూజ వి జే ఐ టి కళాశాల ప్రిన్సిపాల్ ఏ. సృజన

News Image
ముఖ్యమైన పాయింట్స్:శక్తి ఆరాధనకు ప్రతీక.. కర్తవ్య నిర్వహణకు స్ఫూర్తి ఆయుధ పూజ వి జే ఐ టి కళాశాల ప్రిన్సిపాల్ ఏ. సృజన

మొయినాబాద్ అక్టోబర్ 17 శుభోదయ డైనమిక్ న్యూస్

భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో దసరా పండుగ సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం అని ,ఈ పూజ శక్తి ఆరాధనకు, ధర్మ పరిరక్షణకు, కర్తవ్య నిర్వహణకు ప్రతీకగా నిలుస్తుందని విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ ఏ . సృజన అన్నారు. శనివారం వి జే ఐ టి కళాశాలలో మెకానికల్ విభాగం వారు నిర్వహించిన ఆయుధ పూజ కార్యక్రమంలో పాల్గొని ఆయుధ పూజ వెనుక అంతరార్థం వివరించారు.పూర్వకాలంలో యుద్ధాల్లో ఉపయోగించే కత్తులు, కటారులు, విల్లంబులు, ఇతర ఆయుధాలకు పూజలు నిర్వహించేవారనీ కాలక్రమేణా ఈ సంప్రదాయం విస్తరించి, నేటి సమాజంలో తమ జీవనోపాధికి ఉపయోగపడే పనిముట్లు, మరియు తమ వృత్తిని ధర్మంలో రోజువారి ఉపయోగించే యంత్రాలు, వాహనాలు, కంప్యూటర్లు, వృత్తిపరమైన పరికరాలకు కూడా పూజలు చేసే ఆచారంగా మారిందనీ పేర్కొన్నారు. రైతులు నాగళ్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలను, కార్మికులు తమ పనిముట్లను, వాహనదారులు తమ వాహనాలను, వ్యాపారులు వ్యాపారానికి ఉపయోగించే పరికరాలను ఉద్యోగులు నిత్యజీవితంలో ఉపయోగించే పరికరాలను పూజిస్తారనీ అన్నారు.శ్రమకు గౌరవం.. వృత్తి పట్ల అంకితభావం.ఆయుధ పూజ అంటే కేవలం పరికరాలకు పూజలు చేయడం మాత్రమే కాదు. మన జీవనానికి ఆధారమైన సాధనాలను గౌరవించడం, వాటిని సద్వినియోగం చేసుకోవడం, వృత్తి పట్ల అంకితభావంతో పనిచేయడం అనే సందేశాన్ని ఇది అందిస్తున్నది అన్నారు. మెకానికల్ విభాగం హెచ్ ఓ డి శ్రీరామ్ రెడ్డి మాట్లాడుతూ ప్రాచీన కాలంలోనూ కొనసాగుతున్న సంప్రదాయం
నేటి ఆధునిక యుగంలో సాంకేతిక పరికరాలు, యంత్రాలు, వాహనాలు మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయుధ పూజ సంప్రదాయం మరింత విస్తరించిందనీ. విద్యార్థులు పుస్తకాలు, విద్యా పరికరాలకు, ఉద్యోగులు తమ పనికి ఉపయోగించే సాధనాలకు పూజలు నిర్వహిస్తూ జ్ఞానం, నైపుణ్యం, శ్రమకు గౌరవం కలిగిస్తాయన్నారు.దసరా పండుగలో ఆయుధ పూజ భారతీయ సంస్కృతిలోని ఆధ్యాత్మిక భావనతో పాటు శ్రమ గౌరవం, వృత్తి నిబద్ధత, బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు .మన చేతిలోని సాధనాన్ని గౌరవిస్తూ, మన పనిని ధర్మబద్ధంగా నిర్వహిస్తూ, సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలనే సందేశాన్ని ఈ పండుగ అందిస్తుందనీ పలువురు అన్నారు. ఈ కార్యక్రమంలో మెకానికల్ విభాగం ఉద్యోగులు వి.వి సత్యనారాయణ, మదన్ మోహన్, పూజారి పవన్ కళాశాల ఆచార్యులు , బోధన, బోధ నేతర సిబ్బంది ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
🏠 Home