🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 17 October 2026, 3:46 pm Posted by : DAINAMIC NEWS

విభలాపురంలో ఘర్షణ.. యువకుడి మృతి

News Image
ముఖ్యమైన పాయింట్స్:విభలాపురంలో ఘర్షణ.. యువకుడి మృతి

శుభోదయ డైనమిక్ న్యూస్ మోతే అక్టోబర్ 17

మోతె: సూర్యాపేట జిల్లా మోతె మండలం విభలాపురంలో ఘర్షణ జరిగిన మరుసటి రోజు ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం రాత్రి శ్రీరామ్ నగర్ యూత్ సభ్యులు దుర్గామాత విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం ఉదయం అక్కడ టెంట్ హౌస్ గిన్నెలు కడుగుతున్న సమయంలో గ్రామానికి చెందిన నిమ్మల శ్రీకాంత్ (28)కు పనస శ్రీనివాస్, పనస శ్రీలతలతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో శ్రీలత కర్రతో శ్రీకాంత్ తల, చెవిపై కొట్టగా, శ్రీనివాస్ చేతులతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో శ్రీకాంత్‌కు గాయాలయ్యాయి. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో శ్రీకాంత్ తన నివాసంలో మృతి చెందాడు. అతడికి ఫిట్స్ రావడంతో మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. అయితే, ఘర్షణలో తగిలిన గాయాలకు, మృతికి సంబంధం ఉందా అన్నది పోస్టుమార్టం నివేదికతో తేలాల్సి ఉంది. సమాచారం అందుకున్న మోతె పోలీసులు గ్రామానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ప్రస్తుతం పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నట్లు తెలిపారు.
🏠 Home