🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 16 October 2026, 9:51 am Posted by : DAINAMIC NEWS

ఖాతాదారులకు బ్యాంకు సేవలపై అవగాహన హుజూర్‌నగర్‌లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మార్కెటింగ్ డే

News Image
ముఖ్యమైన పాయింట్స్:ఖాతాదారులకు బ్యాంకు సేవలపై అవగాహనహుజూర్‌నగర్‌లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మార్కెటింగ్ డే


హుజూర్‌నగర్, అక్టోబర్ 16 (శుభోదయ డైనమిక్ న్యూస్):

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ హుజూర్‌నగర్ శాఖ ఆధ్వర్యంలో గురువారం మార్కెటింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు అందిస్తున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు, వివిధ రకాల రుణ సదుపాయాలపై ఖాతాదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు.సీనియర్ సిటిజన్ల కోసం 444 రోజుల ప్రత్యేక డిపాజిట్ పథకంపై 7.9 శాతం, 1,000 రోజుల డిపాజిట్ పథకంపై 8 శాతం వడ్డీ అందిస్తున్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని పొదుపుపై మంచి రాబడి పొందాలని సూచించారు.అలాగే వాహన రుణాలు, వాణిజ్య వాహన రుణాలు, గృహ రుణాలను ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో అందిస్తున్నట్లు వివరించారు. సొంత వాహనం కొనుగోలు చేయాలనుకునేవారు, వ్యాపార అవసరాల కోసం వాణిజ్య వాహనాలు తీసుకోవాలనుకునేవారు, సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనుకునేవారు బ్యాంకు రుణ సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు.బ్యాంకు సేవలను మరింత మంది ప్రజలకు చేరువ చేయడం, డిపాజిట్లు, రుణాలపై అవగాహన పెంచడం, బ్యాంకు వ్యాపారాన్ని విస్తరించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బ్యాంకు మేనేజర్ వెంకటేశ్వర్లు, ఫీల్డ్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో అకౌంటెంట్ గులషన్, అటెండర్ అబ్దుల్ సత్తార్, ఖాతాదారులు పాల్గొన్నారు.
🏠 Home