🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 09 October 2026, 6:27 pm Posted by : DAINAMIC NEWS

రైతులకు నిరంతర విద్యుత్ ఇవ్వాలి మఠంపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులతో కలిసి బీఆర్‌ఎస్ నాయకుడు పిల్లుట్ల రఘు ధర్నా

News Image
ముఖ్యమైన పాయింట్స్:రైతులకు నిరంతర విద్యుత్ ఇవ్వాలిమఠంపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులతో కలిసి బీఆర్‌ఎస్ నాయకుడు పిల్లుట్ల రఘు ధర్నా

నెల రోజులపాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తే పంటలు చేతికొస్తాయి: డాక్టర్ పిల్లుట్ల రఘు

మఠంపల్లి, అక్టోబర్ 9 (శుభోదయ డైనమిక్ న్యూస్):

హుజూర్‌నగర్ నియోజకవర్గంలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే నిరంతర విద్యుత్ సరఫరా చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో మఠంపల్లి మండలంలో శుక్రవారం భారీ నిరసన చేపట్టారు. రైతులతో కలిసి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

ఈ సందర్భంగా డాక్టర్ పిల్లుట్ల రఘు మాట్లాడుతూ.. రైతులకు పూర్తిస్థాయిలో విద్యుత్ అందించలేని పాలన ఎందుకని ప్రశ్నించారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో విద్యుత్ కోతల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంటలు ఎండిపోయే ప్రమాదం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు నిరంతర విద్యుత్ అందించామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ కోతలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.

నెల రోజులపాటు నిరంతర విద్యుత్ అందించాలి

సాగునీరు సక్రమంగా అందక ఇబ్బందులు పడుతున్న రైతులకు విద్యుత్ కోతలు మరింత భారంగా మారాయని రఘు అన్నారు. కనీసం నెల రోజులపాటు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తే రైతుల పంటలు చేతికొచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం

రైతులకు తాగునీరు, సాగునీరు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనికి తోడు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో పంటలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. విద్యుత్ కోతలను వెంటనే నిలిపివేసి, పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

పాల్గొన్న నాయకులు, రైతులు

ఈ ధర్నాలో మాజీ జడ్పీటీసీ జగన్ నాయక్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణంరాజు, నియోజకవర్గ సీనియర్ ఉద్యమ నాయకుడు అడ్వకేట్ నగేష్ రాథోడ్, వీరారెడ్డి, ఇస్మాయిల్, మాజీ ఎంపీటీసీ వెంకట్‌రెడ్డి, రామారావు, కిరణ్, పిల్లుట్ల కొండల్, సర్పంచులు కుక్కల వెంకన్న, హరిచంద్రు, భేత వెంకట్‌రెడ్డి, నాగయ్య, శివశంకర్, రామాంజి, గోవింద్, దాసరి వెంకటరమణ, లక్ష్మీనరసింహరాజు, రహీం, కృష్ణయ్య, రాముడు, సైదా నాయక్, టిక్యా నాయక్, భరత్, రంగా, నవీన్, శ్రీను, రాజీవ్, సోమయ్య, బాణావత్ బాబు, శోభన్ బాబు తదితరులతో పాటు అధిక సంఖ్యలో రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు.

🏠 Home