🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 09 October 2026, 6:15 pm Posted by : DAINAMIC NEWS

ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు బహుమతుల ప్రదానం శ్రీవాణి పాఠశాలలో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి: బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొణతం నాగిరెడ్డి

News Image
ముఖ్యమైన పాయింట్స్:ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు బహుమతుల ప్రదానంశ్రీవాణి పాఠశాలలో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలువిద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి: బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొణతం నాగిరెడ్డి

నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ న్యూస్, అక్టోబర్ 9

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆయన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ కొణతం సీతారాంరెడ్డి, యాజమాన్యం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు.

పట్టణ బీజేపీ అధ్యక్షుడు కొణతం నాగిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ట్రెజరర్ తాళ్ల నరేందర్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు సంకలమద్ది సత్యనారాయణ రెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి కొప్పు లక్ష్మీనారాయణ, జిల్లా దివ్యాంగ కన్వీనర్ ఏమిరెడ్డి శంకర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి కాలం నాగయ్య, పట్టణ నాయకులు వెన్నం సురేష్ నాయుడు, దేవిరెడ్డి నాగిరెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.

వ్యాసరచన పోటీలో విజేతలు వీరే..

వ్యాసరచన పోటీలో ఎం. ప్రవస్తి ప్రథమ బహుమతి, జె. మౌనిక ద్వితీయ బహుమతి, కె. సాయి చరణ్ తృతీయ బహుమతి సాధించారు.

చిత్రలేఖనం పోటీలో ప్రతిభ

చిత్రలేఖనం పోటీలో పి. భవ్యశ్రీ ప్రథమ బహుమతి, డి. సత్యహని ద్వితీయ బహుమతి, పి. శీర్షిక తృతీయ బహుమతి పొందారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి

ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షుడు కొణతం నాగిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, మంచి ఉద్యోగాలు సాధించి దేశ సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేయాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.

జిల్లా ట్రెజరర్ తాళ్ల నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబంలో ఎవరి పుట్టినరోజు వచ్చినా ఒక మొక్కను నాటి, దాని సంరక్షణ బాధ్యతను పూర్తిగా తీసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రకృతిని కాపాడుకోకపోతే భవిష్యత్తులో మానవ మనుగడకు ముప్పు ఏర్పడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
🏠 Home