🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 October 2026, 4:07 pm Posted by : DAINAMIC NEWS

“ఫారం-6 మార్పును మేము ఆమోదించలేదు: సుప్రీంకోర్టు స్పష్టీకరణ

News Image
ముఖ్యమైన పాయింట్స్:సీఈసీపై పిటిషన్.. ఈసీ, కేంద్రానికి సుప్రీం నోటీసులు2. ఫారం-6 మార్పుపై సుప్రీంకోర్టు కీలక స్పష్టీకరణ
సీఈసీపై పిటిషన్‌.. ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 5 (శుభోదయ డైనమిక్ వార్త):


ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR)కు సంబంధించిన అంశాలపై దాఖలైన పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేయాలన్న మధ్యంతర అభ్యర్థనకు కోర్టు నిరాకరించింది. కేవలం మీడియా కథనాల ఆధారంగా మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌ నుంచి వివరణ కోరుతూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. SIRకు సంబంధించిన నిర్ణయాలు చట్టబద్ధమైన విధానంలో తీసుకున్నారా అనే అంశంపై వివరాలు సమర్పించాలని ఆదేశించింది. మూడు న్యాయమూర్తుల ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్‌ వి. మోహనతో విచారణ జరిపింది.
🏠 Home