🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 02 October 2026, 12:44 am Posted by : DAINAMIC NEWS

నేరేడుచర్లలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి: మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకటరెడ్డి

News Image

నేరేడుచర్ల, అక్టోబర్ 2 ,శుభోదయ డైనమిక్ న్యూస్




మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నేరేడుచర్ల మున్సిపాలిటీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకటరెడ్డి గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.




సత్యం, అహింసా మార్గాలు ఆదర్శం




మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింసా మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని చైర్మన్ కొణతం చిన్న వెంకటరెడ్డి సూచించారు. సమాజంలో శాంతి, ఐక్యత, స్వచ్ఛతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అన్నారు.




ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనడం




కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు, వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి, 1వ వార్డు కౌన్సిలర్ గుగులోతు రవీందర్ నాయక్, 13వ వార్డు కౌన్సిలర్ బొలిశెట్టి లక్ష్మయ్య, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









🏠 Home