🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 01 October 2026, 2:41 am Posted by : DAINAMIC NEWS

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన చైర్మన్ కొణతం చిన వెంకటరెడ్డి అనారోగ్య బాధితులకు రూ.60 వేల చొప్పున ఆర్థిక సాయం

News Image

నేరేడుచర్ల,శుభోదయ డైనమిక్ వార్త, అక్టోబర్ 1




నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన వెంకటరెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. దాచారం శ్రీరాం నగర్‌కు చెందిన అలుగుబెల్లి సావిత్రమ్మ, కొండేటి మాధవరెడ్డికి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.60 వేల చొప్పున మంజూరైన చెక్కులను అందించారు.




పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండ




ఈ సందర్భంగా చైర్మన్ కొణతం చిన వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థికంగా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.




ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం




కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందని చైర్మన్ తెలిపారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో పేర్వాల రంగారెడ్డి, కొండేటి అరవిందరెడ్డి, కోట వీరస్వామి, కెమెరామెన్ ఆర్ కె తదితరులు పాల్గొన్నారు.

🏠 Home