🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 30 September 2026, 6:40 am Posted by : DAINAMIC NEWS

మోత్కూర్‌లో నూతన కోర్టు మంజూరు చేయాలి తెలంగాణ లా సెక్రెటరీ పి. పాపిరెడ్డికి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే మందుల సామేలు

News Image

త్వరగా కోర్టు మంజూరుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి




హైదరాబాద్ డైనమిక్ డెస్క్, సెప్టెంబర్ 30




తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మోత్కూర్ మండల కేంద్రంలో నూతన కోర్టును త్వరగా మంజూరు చేయాలని కోరుతూ తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు తెలంగాణ రాష్ట్ర లా సెక్రెటరీ పి. పాపిరెడ్డికి వినతిపత్రం అందజేశారు.బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో లా సెక్రెటరీని కలిసిన ఎమ్మెల్యే సామేలు, మోత్కూర్‌లో నూతన కోర్టు ఏర్పాటుకు సంబంధించిన అంశాలను వివరించారు. ప్రజలకు న్యాయ సేవలు మరింత అందుబాటులోకి రావాలంటే కోర్టు మంజూరు అవసరమని తెలిపారు.మోత్కూర్‌లో కోర్టు ఏర్పాటుకు అవసరమైన చర్యలను త్వరితగతిన చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు.

🏠 Home