🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 30 September 2026, 6:34 am Posted by : DAINAMIC NEWS

సర్పంచ్ చలసాని మంజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా పోషణ్ మాసోత్సవాలు స్థానిక ఆహార పదార్థాలతో రక్తహీనతను తగ్గించాలి

News Image

కల్లూరులో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం




నేరేడుచర్ల,శుభోదయ డైనమిక్ వార్త, సెప్టెంబర్ 30




మండలంలోని కల్లూరు గ్రామంలో ముజఫర్‌నగర్ ప్రాజెక్టు, పెంచికల్‌దిన్నె సెక్టార్ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ్ మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ చలసాని మంజుల శ్రీనివాస్ మాట్లాడుతూ స్థానికంగా లభించే సాంప్రదాయ ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు వంటి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా పిల్లలు, గర్భిణీలు, బాలింతల్లో రక్తహీనతను తగ్గించవచ్చని తెలిపారు. అనంతరం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు, సీడీపీఓ పడమట పార్వతి, సూపర్‌వైజర్లు ఎ. యశోద, రాజ్యలక్ష్మి, వైద్యాధికారి సీతామహాలక్ష్మి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

















🏠 Home