దాచారంలో చింతకుంట్ల భిక్షం రెడ్డి విగ్రహావిష్కరణ గ్రామాభివృద్ధి, రైతుల సంక్షేమానికి నిస్వార్థ సేవలు : చైర్మన్ కొణతం చిన వెంకటరెడ్డి
సీనియర్ నాయకుల అనుభవం, సూచనలు పార్టీకి ఎంతో అవసరం
నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త, సెప్టెంబర్ 30
నేరేడుచర్ల మండలం దాచారం గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ చింతకుంట్ల భిక్షం రెడ్డి విగ్రహాన్ని గ్రామ నడికూడలిలో ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కొణతం చిన వెంకటరెడ్డి మాట్లాడుతూ.. చింతకుంట్ల భిక్షం రెడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా, సింగిల్ విండో చైర్మన్‌గా గ్రామ ప్రజలకు, రైతాంగానికి నిస్వార్థ సేవలు అందించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు చివరి శ్వాస వరకు పార్టీలో కొనసాగడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు.సీనియర్ నాయకుల అనుభవం, సూచనలు గ్రామ ప్రజలకు, పార్టీకి ఎంతో అవసరమని పేర్కొన్నారు. భిక్షం రెడ్డి మరణం తీవ్ర బాధకు గురిచేసిందని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆయన జ్ఞాపకార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు
గ్రామ సర్పంచ్ చింతకుంట్ల వీరారెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పేర్వాల రంగారెడ్డి, అనిరెడ్డి మధుసూదన్ రెడ్డి, కొండేటి అరవింద్ రెడ్డి, నూకల భిక్షం రెడ్డి, కేసిడి నర్సిరెడ్డి, సంతోష్ రెడ్డి, మందడి వెంకటరెడ్డి, మందడి అశోక్ రెడ్డి, ఎస్.కె. సైదులు, కోట వీరస్వామి, పగిడి అశోక్, ఆర్ కె తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.