🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 29 September 2026, 5:32 am Posted by : DAINAMIC NEWS

మోతే మండలంలో జెడ్పీ సీఈఓ  శిరీష ఆకస్మిక తనిఖీ పింఛన్ల వెరిఫికేషన్, వీవీజీ రాంజీ పనులపై ఆరా

News Image

శుభోదయ డైనమిక్ వార్త – మోతే, సెప్టెంబర్ 29




మోతే మండల పరిషత్ కార్యాలయాన్ని జెడ్పీ సీఈఓ శిరీష మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో కొనసాగుతున్న పింఛన్ల వెరిఫికేషన్, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియపై ఎంపీడీవో, ఎంపీవోలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.




రిజిస్టర్లను పరిశీలించిన సీఈఓ




పింఛన్ల వెరిఫికేషన్ ఎంతవరకు పూర్తయింది, ఏ విధంగా పరిశీలన చేస్తున్నారనే అంశాలపై ఆరా తీశారు. సంబంధిత రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించి సంతకాలు చేయడంతో పాటు, వివరాలను పూర్తిగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు.




వీవీజీ రాంజీ పనులపై సమీక్ష




వీవీజీ రాంజీ పథకం కింద చేపడుతున్న పనుల ప్రణాళిక, అంచనాలు, పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ తనిఖీలో ఎంపీడీవో సందీప్ కుమార్, ఎంపీవో వంశీ, ఈసీ శ్రీహరి పాల్గొన్నారు.

🏠 Home