🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 22 September 2026, 4:55 am Posted by : DAINAMIC NEWS

ట్యాంకర్‌ బోల్తా.. డ్రైవర్‌ మృతి క్యాబిన్‌ కింద పడి అక్కడికక్కడే మృతి

News Image

శుభోదయ డైనమిక్ వార్త,మోతె, సెప్టెంబర్‌ 22




సూర్యాపేట–ఖమ్మం 365బీబీ జాతీయ రహదారిపై మోతె మండల కేంద్రం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ గోన దావీద్‌ మృతి చెందాడు.




అదుపుతప్పి బోల్తాపడిన ట్యాంకర్‌




మోతె ఎస్సై బి.లచ్చిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం వైపు వెళ్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి రహదారి పక్కన బోల్తాపడింది. ప్రమాద సమయంలో డ్రైవర్‌ దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.




క్యాబిన్‌ కింద పడి మృత్యువాత




డ్రైవర్‌ క్యాబిన్‌ కింద పడి నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడు ప్రకాశం జిల్లా ఎర్రగుంటపాలెం మండలం గుర్జేపల్లి గ్రామానికి చెందిన గోన దావీద్‌గా గుర్తించారు.




సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహం








పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

🏠 Home