🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 19 September 2026, 5:51 am Posted by : DAINAMIC NEWS

కరెంట్ షాక్‌తో రైతు మృతి మిర్యాలగూడ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థుల ధర్నా

News Image

నేరేడుచర్ల, సెప్టెంబర్ 19 శుభోదయ డైనమిక్ వార్త




నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామానికి చెందిన బోరిగొర్ల సైదులు (48), తండ్రి వెంకయ్య, విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పొలానికి కరెంట్ రావడం లేదని ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లిన సైదులకు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.




మృతుడికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు




సైదులుకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.




రోడ్డుపై గ్రామస్థుల ధర్నా




సైదులు మృతికి కారణమైన పరిస్థితులపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై ధర్నా చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.









🏠 Home