🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 29 August 2026, 9:05 pm Posted by : DAINAMIC NEWS

మామిళ్లగూడెం కాంగ్రెస్ అధ్యక్షుడిగా నవిలే శ్రీను ఏకగ్రీవ ఎన్నిక నూతన కమిటీకి కీసర సంతోష్ రెడ్డి శుభాకాంక్షలు

News Image

మోతె, ఆగస్టు 30,శుభోదయ డైనమిక్ వార్త




మోతె మండలం మామిళ్లగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని కార్యకర్తల ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.




నవిలే శ్రీనుకు బాధ్యతలు




మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పందిళ్లపల్లి పుల్లారావు సమక్షంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నవిలే శ్రీను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.




యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అర్వపల్లి మధు




గ్రామ యూత్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా అర్వపల్లి మధు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులను సన్మానించి కీసర సంతోష్ రెడ్డి, పందిళ్లపల్లి పుల్లారావు శుభాకాంక్షలు తెలిపారు.




నాయకులు, కార్యకర్తల హాజరు




కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొరివి నాగమణి వీరస్వామి, మాజీ సర్పంచ్ చెరుకుపల్లి యల్లయ్య, మాజీ ఎంపీటీసీ గుండెపూరి వెంకన్న, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

🏠 Home