🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 25 August 2026, 8:50 pm Posted by : DAINAMIC NEWS

తాడ్వాయి గ్రామంలో ఘనంగా వన మహోత్సవం

News Image

శుభోదయ డైనమిక్ , మునగాల , ఆగస్టు 26




గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కల నాటకం




తాడ్వాయి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా తాడ్వాయి గ్రామంలో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.




పచ్చదనం పెంపొందించడమే లక్ష్యం




గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు సూచించారు. నాటిన మొక్కలను సంరక్షించి, వాటి పెరుగుదలకు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.




మొక్కల సంరక్షణ అందరి బాధ్యత




వన మహోత్సవం ద్వారా గ్రామాల్లో పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని వారు తెలిపారు. ప్రతి కుటుంబం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాంబాయమ్మ బుచ్చి పాపయ్య, ఉపసర్పంచ్ సైదులు, వార్డు సభ్యులు జిల్లేపల్లి సుమన్, పంచాయతీ కార్యదర్శి రాము నాయక్, సర్పంచ్ టెక్నికల్ అసిస్టెంట్ రాంబాబు, ఫీల్డ్ అసిస్టెంట్ బుచ్చమ్మతో పాటు గ్రామస్థులు కోట వెంకటయ్య, ఎం. యల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

🏠 Home