🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 23 August 2026, 5:34 am Posted by : DAINAMIC NEWS

రామాపురంలో వైభవంగా బోనాల పండుగ ముత్యాలమ్మకు భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ

News Image

నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త, ఆగస్టు 23




నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురం గ్రామంలో ఆదివారం బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. గ్రామదేవత ముత్యాలమ్మకు మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు బోనాలను అందంగా అలంకరించి నెత్తిన ఎత్తుకుని మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. దీంతో గ్రామంలో పండుగ సందడి నెలకొంది.




సమృద్ధిగా వర్షాలు కురవాలని అమ్మవారికి మొక్కులు




సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని, గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.




ఎస్ఐ గోపాల్ రెడ్డి, కౌన్సిలర్ వాసా జ్యోతి శేఖర్ ప్రత్యేక హాజరు








బోనాల వేడుకల్లో ఎస్ఐ గోపాల్ రెడ్డి, 7వ వార్డు కౌన్సిలర్ వాసా జ్యోతి శేఖర్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. గ్రామ పెద్దలు కొదమ గుండ్ల నాగరాజు, చందమల్ల వెంకన్న, చందమల్ల లక్ష్మయ్య, సామ సురేష్, శివనేని విజయ్, అనిల్, ఏసు తదితరులు పాల్గొన్నారు. గ్రామ మహిళలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు.

🏠 Home