🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 August 2026, 5:28 am Posted by : DAINAMIC NEWS

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మెషీన్లు బీసీ నిరుద్యోగ మహిళలకు అవకాశం.. సెప్టెంబర్‌ 15లోగా దరఖాస్తులు

News Image

నేరేడుచర్ల, ఆగస్టు 14,శుభోదయ డైనమిక్ వార్త




బీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మెషీన్లు’ పథకానికి అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని నేరేడుచర్ల ఏపీఎం శ్రీనివాస్ సూచించారు.




18 నుంచి 55 ఏళ్ల మహిళలు అర్హులు




తెలంగాణలోని బీసీ వర్గాలకు చెందిన 18 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగ మహిళలు ఈ పథకానికి అర్హులని తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదని పేర్కొన్నారు.




వీరికి ప్రాధాన్యం




వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, దివ్యాంగులు, అలాగే ఇప్పటికే కుట్టు వృత్తిలో అనుభవం ఉన్న మహిళలకు ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒక కుటుంబానికి ఒక యూనిట్ మాత్రమే మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.




సెప్టెంబర్‌ 15లోగా దరఖాస్తు




అర్హత ఉన్న మహిళలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఫొటో, బ్యాంకు పాస్‌బుక్ వివరాలతో తెలంగాణ OBMMS పోర్టల్‌లో సెప్టెంబర్‌ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని ఏపీఎం శ్రీనివాస్ సూచించారు. అర్హులైన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని కోరారు.

🏠 Home