🏠 dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 02 August 2026, 10:06 pm Posted by : DAINAMIC NEWS

రాఘవపురం ఎక్స్ రోడ్డు గ్రామ శాఖ అధ్యక్షునిగా కారింగుల లింగమూర్తి గౌడ్

News Image

శుభోదయ డైనమిక్ న్యూస్, మోతే, ఆగస్టు 3




గ్రామ నాయకుల ఏకగ్రీవ నిర్ణయంతో బాధ్యతలు అప్పగింత




మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా కారింగుల లింగమూర్తి గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక సర్పంచ్ కోల లింగయ్య గౌడ్, ఉపసర్పంచ్ తాటికొండ సుజిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన లింగమూర్తి గౌడ్‌కు గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు.




ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా – లింగమూర్తి గౌడ్




ఈ సందర్భంగా కారింగుల లింగమూర్తి గౌడ్ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎన్నుకున్న గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజలతో ఎల్లప్పుడూ మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. పార్టీ బలోపేతంతో పాటు గ్రామాభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు సాగుతానని ఆయన అన్నారు.

🏠 Home